Showing posts with label ఎన్టీఆర్. Show all posts
Showing posts with label ఎన్టీఆర్. Show all posts

Tuesday, April 7, 2009

ఒకే వేదిక మీద బాలయ్య, ఎన్టీఆర్



హైదరాబాద్‌: బాబాయ్, అబ్బాయి ఒకే వేదిక మీదికి రానున్నారు. ఈ నెల 21వ తేదీన వారు తిరుపతి బహిరంగ సభలో పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ప్రచారాన్ని ఈ నెల 21వ తేదీన తన ప్రచార కార్యక్రమాన్ని తిరుపతిలో ముగిస్తారు. చంద్రబాబుతో పాటు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఈ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. చంద్రబాబు తన ప్రచార కార్యక్రమాన్ని తిరుపతి నుంచే ప్రారంభించారు. దాన్ని తిరుపతి నుంచే ముంగించాలని కూడా ఆయన అనుకుంటున్నారు. దీంతో 21వ తేదీ సభకు శ్రీకారం చుడుతున్నారు. పైగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. చిరంజీవికి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సవాల్ గా ఈ సభలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

విజయవాడలో ఒక బహిరంగ సభలో పాల్గొనాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. విజయవాడ లోకసభ స్థానం నుంచి ఆయన మిత్రుడు వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన మిత్రుడి కోసం ఈ సభలో పాల్గొనాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16వ తేదీన అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా అనేది అనుమానంగా ఉంది. రెండు రోజుల్లో ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కావచ్చునని చెబుతున్నారు. అయితే ఆయన వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా సమీక్షించిన తర్వాతనే ఏమైనా తేలుతుందని అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ను వైద్యులు మంగళవారం నడిపించే అవకాశం ఉంది. నాగార్జున, కవిత తదితరులు ఆస్పత్రికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శించారు.